మైదా పిండితో ఎన్నిఅనార్థాలో!

73
- Advertisement -

మైదా పిండితో చేసే వంటకాలను చాలమంది లొట్టలేసుకుంటూ తింటారు. ముఖ్యంగా బయట హోటల్స్ లో మైదా పిండితో చేసిన వంటకాలు ఎక్కువగా దర్శనమిస్తాయి. చపాతీ, పరోటా, బ్రెడ్, ఫఫ్, నుడిల్స్ వంటి వాటిని మైదా పిండితోనే తయారు చేస్తారు. గోదుమ పిండితో పోల్చితే మైదా పిండి తక్కువ ధరకే లభిస్తుండడంతో ఎక్కువగా హోటల్ లలో మైదా పిండినే ఉపయోగిస్తారు. ఇక రుచి పరంగా కూడా మైదాతో చేసిన వంటకాలు చాలా రుచిని అందిస్తాయి. అందుకే మైదా పిండి వాడకం చాలా ఎక్కువగా ఉంది. అయితే మైదా పిండితో చేసిన వంటకాలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు పొంచిఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా గోదుమ పిండిలో కొన్ని పోషకాలు ఉంటాయి కానీ గుదుమపిండిని పాలిష్ చేసిన తరువాత మైదా తయారవుతుంది. కాబట్టి గోధుమలో ఉండే పోషకాలు మైదా లో లభించవు. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే ఎంతో కొంత పీచు అవసరం పడుతుంది. మైదాలో పీచు శాతం జీరోగా ఉంటుంది కాబట్టి త్వరగా జీర్ణం అవ్వదు. అంతే కాకుండా పేగులలోని గోడలకు పేరుకొని పోయి క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంది. మైదాతో చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు కూడా ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహానికి కూడా దారి తీస్తుందట. అంతే కాకుండా మైదాతో చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతం వేగంగా పెరుగుతుంది. తద్వారా ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. ఇంకా మైదాలో ఐరన్ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రక్త హీనత ఏర్పడే ఛాన్స్ కూడా ఉందట.. కాబట్టి మనం తినే వంటల్లో మైదా ను చాలా వరకు తగ్గించి వాటి స్థానంలో గోధుమ పిండి లేదా చిరు దన్యాలను వాడడం మంచిది. ఒకవేళ మైదాపిండిని వాడడం తప్పనిసరి అయితే అందులో గోధుమ పిండి కలుపుకొని వాడడం మంచిదని నిపుణులు చెబుతున్నా మాట.

Also Read:KTR:దమ్మున్న నాయకుడు వినోద్

- Advertisement -