ఆ కన్నీళ్లకు కారణం పవన్ లాంటి హీరోలే

33
- Advertisement -

పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ప్రజల బాగు కోసమే అన్నట్లు ఉంటుంది. మరి ఎవరో పరిచయం లేని ప్రజల కోసమే అంతగా ఆలోచించే పవన్ కళ్యాణ్.. ఇక తనను నమ్ముకున్న వారిని ఇంకెంత గొప్పగా ప్రేమిస్తాడో.. వారికీ ఎంత గొప్పగా అండగా నిలబడతాడో కదా. కానీ, అందుకు విరుద్ధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ ప్రవర్తన. పెద్ద పెద్ద విషయాలు మాట్లాడేసి.. ఇండస్ట్రీ మీద పడి డబ్బు పోగోసుగుంటూ.. ఆ ఇండస్ట్రీని పార్ట్ టైమ్ జాబ్ లా చూస్తున్న పవన్ తీరు చూస్తుంటే.. నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. మైక్ పట్టుకుంటే.. బోలెడు నీతులు చెప్పే పవన్.. ఇలా ఎందుకు చేస్తున్నాడు ? అని అనుమానం కలుగుతుంది.

నేను నటిస్తున్నానంటే ఇండస్ట్రీలో పదిమందికీ ఉపాధి దొరుకుతుందని చెప్పుకునే పవన్.. నిర్మాతల జీవితాలు నాశనం అవుతున్నాయి అని ఎందుకు చెప్పడం లేదు ?. ఇండస్ట్రీ కార్మికుల మీద పెద్ద ఔదార్యం కనబరుస్తూ… ఇండస్ట్రీ పచ్చగా ఉండటం కోసమే తాను నటిస్తున్నట్టుగా, సినిమాలు చేస్తున్నట్టుగా చెప్పే పవన్ కళ్యాణ్ కి.. నిర్మాత ఎ. ఎం. రత్నం కన్నీళ్లు ఎందుకు కనబడటం లేదు ?. వైసీపీ రాజకీయ నాయకులు అకారణంగా తన మీద ద్వేషాన్ని చిమ్ముతున్నారన్నట్టుగా పవన్ చెబుతూ ఉంటాడు.

నిజానికి ఇండస్ట్రీలో శ్రమ మాత్రమే దోపిడీకి గురికావడం లేదు… క్రియేటివిటీ కూడా వంచనకు, దోపిడీకి గురవుతోంది. అంతకు మించి ఎ. ఎం. రత్నం లాంటి నిర్మాతలు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోల కారణంగా నరకం అనుభవిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం మొదలైన సినిమా.. నేటికీ అయోమయంలో ఉందంటే.. కారణం పవన్ కల్యాణే. నిర్మాతలు బయటపడి చెప్పుకోలేరు అంతే. హరి హర వీరమల్లు లాంటి సినిమాల వల్ల అనేక మంది కలలు కల్లలైపోయి దిక్కుమాలిన జీవితాలు గడుపుతున్నారు. దీనికి బాధ్యులు పవన్ లాంటి హీరోలే.

Also Read:వెన్నెల కిశోర్ హీరోగా… ‘చారి 111’

- Advertisement -