- Advertisement -
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ‘లెనిన్’ చిత్ర దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి (VIP) విరామ సమయంలో వారు శ్రీవారి సేవలో పాల్గొని తమ ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి వేదాశీర్వచనం చేయగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయ అధికారులు శేషవస్త్రం కప్పి గౌరవించారు. అనంతరం సినీ ప్రముఖులకు స్వామివారి శేషవస్త్రాలతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.
Also Read:రూ.271 కోట్లకు పెంట్‌హౌస్..రికార్డు డీల్!
ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన వారు, తమ రాబోయే చిత్రాలు విజయం సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
- Advertisement -

