సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై మీరు నిర్మించే చిత్రాల్లో ప్రకటన రూపంలో అవగాహన కల్పించాలని చిత్ర నటీనటులను నిర్మాత లను కోరడం స్వాగతించదగ్గ విషయమని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు. చలనచిత్ర నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు ..
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆ ప్రకటన లో మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి ఆల్రెడీ ఈ ప్రకటన చిత్రం లో నటించడం వారి సామాజిక సృహకు నిదర్శనమని , ముఖ్యంగా ఎప్పుడు ఈ డ్రగ్స్ గురించి పట్టుపడినప్పుడు సినిమా వాళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి కాబట్టి వారు ఆ అపవాదును పోగొట్టుకునుటకు ఇది ముఖ్యమంత్రి చిత్ర పరిశ్రమకు ఇచ్చిన ఒక వరమని, తానూ గతంలో చిత్ర పరిశ్రమ పై డ్రగ్స్ వాడకం పై ఎన్నో రకమైన వాదనలు ఉన్నప్పుడు వాటిని నివృత్తి చేయుటకు సుప్రీం కోర్టు ను ఆశ్రయించట0 జరిగిందని ,ఇంకా నేను వేసిన కేస్ సుప్రీం కోర్టు లో ఉందని, డ్రగ్స్ పై వాడకం దారుల పై,పెడలెర్స్ పై ఒక సమగ్ర చట్టం చేయలని కోరుతూ, టాలీవుడ్ డ్రగ్స్ కుంభకోణం పై సమగ్ర విచారణ చేయలని కోరడం జరిగిందని,
నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమా కు ముందు అవగాహన ప్రకటన లను ప్రదర్శించాలని కోరడం మంచి నిర్ణయమని,కేవలం సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు, కానీ వీటి పై అవగాహన కూడా కల్పించుటలో ముందు ఉండలనటం,డ్రగ్స్, సైబర్ నేరాల పై సినిమా కు ముందు కానీ సినిమా తరువాత అయిన 3 నిమిషాలు వీడియో తో అవగానే కల్పించాలనటం అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదని తెలపటం అలాంటి నిర్మాతలకు , డైరెక్టర్ లకు , తారాగణంకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవని ముఖ్యమంత్రి తెలపటం, సినిమా థియేటర్లు యాజమాన్యాలు కూడా సహకరించాలి.డ్రగ్స్, సైబర్ నేరాలు పై థియేటర్లు లో ప్రసారం చేయక పోతే మీ థియేటర్లు కు అనుమతి లేదని ముఖ్యమంత్రి తెలపటం గురించి పరిశ్రమ గుర్తించి ,నటీనటులు,నిర్మాత లు థియేటర్ యాజమాన్యం వారి మహోథ్యమంలో భాగస్వామ్యం అవ్వాలని కేతిరెడ్డి కోరారు.
Also Read:TTD:భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత