అనిల్ రావిపూడికి ఖరీదైన గిప్ట్ ఇచ్చిన దిల్ రాజు..

342
Dil raju anil ravipudi
- Advertisement -

టాలీవుడ్  అగ్ర నిర్మాతలలో దిల్ రాజు కూడా  ఒకరు. ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల్లో ఒక రెండు తప్ప మిగతావన్ని భారీ విజయాలను అందుకున్నాయి. అందుకు కారణం ఆయన కథను ఎంచుకునే విధానం. తాజాగా దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఎఫ్2 మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం దిల్ రాజు తెరకెక్కించిన 7సినిమాలు వరుస విజయాలు సాధించాయి. ఈసంవత్సరం మొదట్లోనే ఆయన భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారో దిల్ రాజుకు చాలా బాగా తెలుసని చెప్పుకోవాలి.

ఇక ఎఫ్ 2 మూవీ భారీ లాభాలను తెచ్చిపెట్టడంతో ఆ చిత్రయూనిట్ ను ఫారిన్ ట్రిప్ కు పంపించారు దిల్ రాజు. చిత్రయూనిట్ ను ఫారిన్ ట్రిప్ పంపించడం ఆయనకు ఇది కొత్తేమి కాదు. గతంలో కూడా భారీ సక్సెస్ సాధించిన సినిమా యూనిట్ ను ఇలా ట్రిప్ లను పంపించారు. తాజాగా ఎఫ్ 2 చిత్రయూనిట్ ను బ్యాంకాంక్ కు పంపించారు. దీని కోసం ఆయన రూ.50లక్షలు ఖర్చు చేశారట. జనవరి 12న విడుదలైన ఈమూవీ నిన్నటితో 50రోజులు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా టీమ్ కి ‘ఐ ఫోన్’ లు కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడికి ఓ స్పెషల్ గిప్ట్ ఇచ్చినట్టు తెలిపాడు. ఆయన సన్నిహితుల సమాచారం మేరకు దిల్ రాజు ఆయనకు బిఎండబ్ల్యూ కారు గిప్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక అనిల్ రావిపూడి తర్వాత సినిమా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయనున్నాడు. ఈసినిమాకు కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కావడం విశేషం. ఈసినిమాతో మరెన్ని రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

(మహా శివరాత్రి లైవ్‌..https://goo.gl/NkCYek)

- Advertisement -