పవన్ మూవీపై దిల్ రాజు ఎమన్నారంటే?

331
Dil Rajun Pawan Kalyan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ చాలా రోజుల గ్యాప్ తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో భారీ సక్సెస్ ను అందుకున్న పింక్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈమూవీలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీని దిల్ రాజు, బోని కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈమూవీపై స్పందించారు నిర్మాత దిల్ రాజు. సమంత, శర్వానంద్ జంటగా నటించిన జాను మూవీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దీంతో ఈచిత్రయూనిట్ తిరుపతి వెంకటేశ్వర్ స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ జరుగుతుంది. .మార్చిలో పింక్‌ రీమేక్ ఫస్ట్‌లుక్‌ను, మేలో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈమూవీతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్‌. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ ప్రారంభం కాగా..గబ్బర్ సింగ్ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది.

- Advertisement -