పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నానని చెప్పారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. పవన్ కళ్యాణ్ సినిమా చేయాలనేది నా 20ఏండ్ల డ్రిమ్ అన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ షూటింగ్ పాల్గొంటారని చెప్పారు. పవన్ కళ్యాన్ కోసం మీతో పాటు నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కాగా నిన్న రాత్రి జరిగిన ప్రతిరోజు పండగే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈకామెంట్ చేశారు దిల్ రాజు.
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అజ్నాతవాసి సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతను సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో ఆయన మళ్లీ తిరిగి సినిమాలు చేస్తాడని ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు ఆయన ఎక్కడా ప్రకటించకపోయినా ఫిలిం నగర్ వర్గాల్లో మాత్రం ఆయన రీ ఎంట్రీ కన్ఫార్మ్ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ పింక్ మూవీ రీమేక్ లో నటించనున్నాడని తెలుస్తుంది. ఈమూవీకి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ కూడా పూర్తైందని..ఈమూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈసినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే ఈమూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.