ఫిష్ వెంకట్‌కి అండగా నిర్మాత చదలవాడ

6
- Advertisement -

తెలుగు సినిమాలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించిన ఫిష్ వెంకట్. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల తనకు కలిగిన ఆర్థిక ఇబ్బందిని తెలుసుకుని వైద్య, ఆర్థిక సహాయార్థం లక్ష రూపాయలు అందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు. చదలవాడ శ్రీనివాసరావు గారి తరఫున ఫిష్ వెంకట్ కు చెక్కును అందించిన టి ఎఫ్ పి సి ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ , టి ఎఫ్ పి సి సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ , దర్శకుడు కె. అజయ్ కుమార్ ,తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్.

ఈ సందర్భంగా టి ఎఫ్ పి సి ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ : మా చదలవాడ శ్రీనివాసరావు గారు ఎక్కడో వీడియోలో ఫిష్ వెంకట్ గారు పడుతున్న ఇబ్బంది చూసి ఆర్థిక సహాయార్థం లక్ష రూపాయలు అందించారు. అడిగితేనే సహాయం చేయలేని ఈ రోజుల్లో అడక్కుండానే సహాయం చేసే ఆయన్ని దేవుడు గా మహానీయుడుగా భావించవచ్చు. అడగకుండానే కష్టం తెలుసుకొని ఇంతటి సహాయం చేసిన చదలవాడ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అన్నారు.

దర్శకుడు కె. అజయ్ కుమార్ మాట్లాడుతూ : రాత్రి న్యూస్ ఛానల్ లో వేసిన ఒక వీడియోలో ఫిష్ వెంకట్ గురించి చూసి తెలుసుకుని చదలవాడ శ్రీనివాసరావు గారు లక్ష రూపాయలు సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఆయన సినిమాల్లో నటించిన నటించకపోయినా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఫిష్ వెంకట్ గారు నటన తో ఎన్నో మంచి పాత్రలో నటించారు కాబట్టి ప్రస్తుతం ఆయన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని చదలవాడ శ్రీనివాసరావు గారు సహాయాన్ని అందించారు. ఫిష్ వెంకట్ గారి తరఫున చదలవాడ శ్రీనివాసరావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఫిష్ వెంకట్ మాట్లాడుతూ : నా కష్టాన్ని తెలుసుకుని అడగకుండానే లక్ష రూపాయలు సహాయం అందించిన చదలవాడ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చేసిన ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను నా కుటుంబం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఇలాగే ఆయన ఇంకా ఎంతో మందికి సేవ చేసే విధంగా ఆ దేవుడు ఆశీస్సులు ఆయన పైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Also Read:పర్యావరణ పరిరక్షణ కోసం ‘విత్తన గణపతి’: సంతోష్ కుమార్

- Advertisement -