ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ (85) ఇక లేరు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అపారమైన సేవలు అందించిన ఈ లెజెండరీ నిర్మాత బుధవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. శరవణన్, ఏవీఎం పిక్చర్స్ స్థాపకుడు ఏ.వి. మేయప్పన్ గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి, తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో 300కు పైగా చిత్రాలను నిర్మించారు. వ్యాపార స్థాయిలోనే కాక, సాంస్కృతికంగా, కళాత్మకంగా కూడా ఆయన నిర్మించిన అనేక చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి.
తెలుగులో ‘సంసారం ఒక చదరంగం’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘మెరుపు కలలు’, ‘లీడర్’ వంటి సినిమాలను నిర్మించి ప్రేక్షకులను మెప్పించారు. తమిళంలో ‘శివాజీ’, ‘జెమిని’ వంటి బిగ్ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు.
దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన ఇండస్ట్రీకి అనేక మంది నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేసి ప్రోత్సహించారు. ఏవీఎం స్టూడియోలు భారత సినిమా రంగంలో ఒక ప్రతిష్టాత్మక స్థాయిని సంపాదించడంలో శరవణన్ పాత్ర అపారమైనది. శరవణన్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన స్మృతులు, ఆయన అందించిన అద్భుతమైన చిత్రాలు ఎల్లప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.
Also Read:మోనాలిసా.. ‘లైఫ్’ మొదటి షెడ్యూల్

