రైతు బంధుతో రైతులకు మనో ధైర్యం- ప్రొ. మహేంద్ర దేవ్

116
- Advertisement -

సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ( సెస్ ) బేగంపేటలో ప్రముఖ ఆర్థికవేత్త వహీదుద్దీన్ ఖాన్ స్మారక ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ముంబయిలోని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ పాల్గొన్నారు. ఇంకా సెస్ వ్యవస్థాపక సభ్యులు ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ. రేవతి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీ.ఆర్.రెడ్డి, రిటైర్డ్ ఐ. ఏ.ఎస్. అధికారి ఏ.కే. గోయల్, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా పలువురు హాజరైయ్యారు.

“బియాండ్ ఇండియా @ 75 : గ్రోత్, ఇంక్లుజన్ అండ్ సస్తేనేబిలిటీ ” అనే అంశంపై ప్రొఫెసర్ మహేంద్ర దేవ్ ప్రసంగించారు. వరి, గోధుమలు, చెరుకు పంటలకు 75% శాతం నీళ్లు అవసరం అవుతోంది. ఆ పంటలకు బదులు పప్పు దినుసులు, మిల్లెట్స్ వంటి పంటలు ఎంతో మేలు అని అన్నారు. రైతు బంధు పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇది రైతులకు ఎంతో మనో ధైర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ఈ పథకాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. వ్యాల్యూ చేంజ్ వ్యవసాయం ఎంతో లాభసాటిగా ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో చిప్స్, వంటి చిరు తిండ్లు దొరుకుతాయి.. కానీ ఫ్రూట్స్ దొరకడం లేదు. ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో ఇండియా 2% శాతంలో ఉండగా, చైనా 13% శాతంలో ఉంది అన్నారు.

- Advertisement -