దోమలను పట్టుకుంటే ప్రైజ్ మనీ!

20
- Advertisement -

ఫిలిప్పీన్స్‌లో దోమల నియంత్రణకు అదిరే ఆఫర్ ప్రకటించారు . డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసులను ఎదుర్కొనేందుకు మనీలా అనే గ్రామంలో ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. గ్రామస్థులు ఐదు దోమలను – అవి బ్రతికైనా, చనిపోయినవైనా – గ్రామ కార్యాలయానికి తేవాలని కోరారు. ప్రతిగా వారికి ఒక్కో దోమకు ఒక పిసో (సుమారు 1.5 భారతీయ రూపాయలు) బహుమతిగా అందించనున్నారు!

ఒక దోమకు ఒక పిసో అనే ఈ ప్రాజెక్ట్‌ కు మంచి రెస్పాన్స్ వస్తోంది . ప్రజలు దోమలతో క్యూ లైన్‌లో నిలబడుతుండటం విశేషం. దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్లో దోమలను పెంచుకుంటూ, త్వరగా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తారా? అని చెబుతుండగా ఈ ఆఫర్‌కు మాత్రం స్థానికంగా మంచి స్పందన వస్తోంది.

Also Read:LRS పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్!

- Advertisement -