ప్రాంక్ బుమారాంగ్..ప్రియాంకపై టీటీడీ చర్యలు!

4
- Advertisement -

తిరుమలలో ప్రియాంక జైన్ చేసిన ప్రాంక్ బుమారాంగ్ అయింది. ప్రాంక్ పేరుతో కొంతమంది చేసే చేష్టలు హద్దులు దాటుతుండటం ,ఇష్టానుసారంగా ప్రాంక్స్ తో ప్రవర్తిస్తూ … తరువాత సారి అంటు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా పవిత్రమైన తిరుమలలో ప్రియాంక జైన్, ఆమె ప్రియుడు శివ్ కుమార్‌ చేసిన ప్రాంక్ దుమారం చేపింది. మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడవ మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీల్స్ చేసింది ప్రియాంక జైన్. చిరుత వచ్చిందని.. ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు. తర్వాత ఈ వీడియోని యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. వీడియో చివర్లో చిరుత లేదు ఏం లేదు అంతా ఫ్రాంక్ అంటూ చెప్పగా ఈ వీడియోని లక్షల మంది చూశారు.

ఈ వివాదం టీటీడీ దృష్టికి రావడంతో టీటీడీ పాలకమండలి సభ్యుడు, బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి స్పందించారు. పవిత్రమైన గుడిలో ఇలాంటి పనులు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Also Read:TRAI: ఓటీపీ మెస్సేజ్‌లు ఆలస్యం

- Advertisement -