గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొన్నసాగిస్తున్న విషయం తెలసిందే. ఉక్రెయిన్ ప్రజల దయనీయ స్థితిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. వారి విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ శరణార్థుల పరిస్థితిపై బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్పందించారు. యునిసెఫ్ సౌహార్ద్ర రాయబారి హోదాలో ఆమె అంతర్జాతీయ నేతలకు పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ స్థాయిలో పిల్లలు చెల్లాచెదురవుతున్నారని, ఉక్రెయిన్ శరణార్థులను ఆదుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు.
‘ప్రపంచ నాయకులారా… మనం ఇక ఎంతమాత్రం చూస్తూ ఊరుకోలేం. శరణార్థులకు అండగా నిలిచి, వారికి అవసరమైన సహాయం చేయడానికి ముందుకు వస్తారా…’ అంటూ ప్రియాంక చోప్రా ఓ వీడియో సందేశం వెలువరించారు. ఈ మేరకు ప్రపంచస్థాయిలో విరాళాల కోసం అభ్యర్థన చేశారు. అంతేకాదు, స్పందించే దాతల కోసం యునిసెఫ్ విరాళాల లింక్ ను కూడా పొందుపరిచారు.