ప్రియాంక చోప్రా.. పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో సత్తాచాటిన ఈ బ్యూటీ హలీవుడ్లో సైతం పాగావేసింది. తన అందచందాలను ఆరబోస్తోంది. ఏ మాత్రం మొహమాటలకు పోకుండా క్లీవెజ్ షోను ప్రదర్శిస్తోంది. అందాల ప్రదర్శనలో లేటెస్ట్ ట్రెండ్‌ను సెట్ చేస్తూ ముందుకు సాగుతున్న ప్రియాంక క్వాంటికో సిరీస్‌తో తెగ పాపులరైపోయింది.
ఈ బ్యూటీ క్వాంటికో సిరీస్ కోసం గత కొన్ని నెలలుగా న్యూయార్క్‌లో గడుపుతోంది. ఇక ‘క్వాంటికో’ టీవీ సిరీస్‌తోనే హాలీవుడ్లో అడుగు పెట్టింది ప్రియాంక. ‘క్వాంటికో’ రెండో సీజన్ చిత్రీకరణ కూడా గత నెలలో పూర్తయింది. ఇదిలా ఉంటే..మరో వారంలో ప్రియాంక న్యూయార్క్ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది.
ఈ సందర్భంగా ‘‘న్యూయార్క్‌ను విడిచి రావడంలో బాధ, సంతోషం… రెండూ ఉన్నాయి. ఇండియాకి త్వరలో వచ్చేస్తున్నాను అని ఆనందంగా ఉన్నాను. న్యూయార్క్‌లో గడిపిన రోజుల్ని తలచుకుంటుంటే వెళ్లిపోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు’’ అని ట్వీట్ చేసింది ప్రియాంక. అయితే ఏబీసీ సంస్థతో ప్రియాంక ఒప్పందం చేసుకుందట.
‘క్వాంటికో’ మూడో సీజన్‌ను తెరకెక్కించే యోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఇక ప్రియాంక చోప్రా నటించిన తొలి హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’ ప్రచారం కోసం మేలో అమెరికా వెళ్లే అవకాశం ఉంది ప్రియాంక.