బేవాచ్‌ పెద్దలకే !

324
Priyanka Chopra request About Baywatch
Priyanka Chopra request About Baywatch
- Advertisement -

బాలీవుడ్‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన ప్రియాంక చోప్రా క్వాంటికో షోతో హాలీవుడ్ టీవీ సిరీస్‌లో అడుగుపెట్టింది. అక్క‌డ అది బంప‌ర్ హిట్‌ అవ్వడంతో ఆ త‌ర్వాత వెంట‌నే స్కార్పియ‌న్ కింగ్ హీరో రాక్‌ సర‌స‌న `బేవాచ్‌` మూవీలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా ఈనెల‌లోనే రిలీజ‌వుతోంది. ఇప్పటికే అమెరికాలో దాదాపుగా సెటిల్ అయిపోయిన ప్రియాంక చోప్రా.. టెలివిజన్ షో క్వాంటికో ద్వారా ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఇప్పుడు బేవాచ్ మూవీలో విక్టోరియా లీడ్స్ పాత్రతో మరింతగా రక్తి కట్టించేస్తోంది.

Priyanka Chopra Talks About Baywatch

మరి రీసెంట్ గా బేవాచ్ వరల్డ్ ప్రీమియర్ ను మియామీలో ప్రదర్శించారు. ఈ ఈవెంట్ కు పీసీ కూడా అటెండ్ అయింది. అంతే కాదు.. సినిమాకి సంబంధించి బోలెడన్ని సంగతులు కూడా అందరితో పంచుకుంది. ‘ఈ సందర్భంగా ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె బేవాచ్ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బేవాచ్ నేను నటించిన ఆర్ రేటెడ్ సినిమా. హై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పెద్దలకు మాత్రమే. దయచేసి చిన్న పిల్లలకు ఈ చిత్రాన్ని చూపించవద్దని కోరుతున్నాను. సినిమా అంగీకరించినప్పుడే సినిమాలోని డైలాగ్‌లతో పాటు, సన్నివేశాలు కొంత ఇబ్బందికరంగా వుంటాయి. కథ ప్రకారం అలాంటివి అవసరం కూడా. సినిమా నాకు పెద్ద సవాల్ లాంటిదని తెలుసు అని అని పీసీ ఫినిషింగ్ టచ్ ఇవ్వడమే అసలు విషయం. ఇంతకీ పీసీ ఇలా డైరెక్టుగా చెప్పేసిందంటే.. సినిమాలో సెక్స్ డోస్ ఎక్కువైందా.. లేక హింస ఎక్కువగా ఉందా అనే అనుమనాలు సహజం.

Priyanka-Chopra-Bikini-Photos-10

కానీ ప్రియంక ఇలా చెప్పడంలో మార్కెటింగ్ ట్రిక్ కూడా ఉండొచ్చు. బేవాచ్ అంటేనే.. బీచ్ అండ్ గాళ్స్ హంగామా. ఇప్పుడు పిల్లలను వద్దు అని స్వయంగా విలన్ పాత్రధారిణి చెప్పిందంటే.. అమ్మాయిల అందాలపై అభిమానుల అంచనాలు ఆకాశానికి అంటుతాయి కదా. అందుకే అలా అమ్మడు చెప్పుకొచ్చిందన్న మాట.

- Advertisement -