సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్రియాంక చోప్రా

372
Priyanka-Chopra-smokes-on-yacht-in-Miami-netizens-trolling-her-
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తరచు వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పుడు ఎదో ఒక దానిపై కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె హైలెట్ అవుతారు. సోషల్ మీడియాలో నీతి వ్యాఖ్యలు చెప్పే ప్రియాంక తాజాగా కెమెరాకు అడ్డంగా దొరికొపోయింది. ప్రియంక చోప్రా ప్రస్తుతం తన భర్త నిక్ జోనస్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

విదేశాల్లో సముద్రపు ఒడ్డున సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కింది ప్రియాంక. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో నీతులు చెప్పె ప్రియాంక..ఇప్పుడు నీవు చేస్తున్న పని ఎంటని నెటిజన్లు ట్వీట్టర్ వేదికగా ఆమెను ప్రశ్నిస్తున్నారు.

గ‌త‌ ఏడాది దీపావళి సందర్భంగా ప్రియాంక చోప్రా తనకు ఆస్తమా ఉందని.. అందుకే దీపావళికి దూరంగా ఉంటున్నానని.. తన అభిమానులు కూడా బాణసంచా వల్ల వచ్చే పొగ నుంచి దూరంగా ఉండాలని చెబుతూ.. బాణాసంచా కాల్చివద్దని ఆమె అంద‌రికీ పరోక్షంగా త‌న ట్వీట్ల ద్వారా తెలిపింది. ఇక ఇప్పుడు ఈఫోటలపై ప్రియంక ఏవిధంగా రిప్లే ఇస్తుందో చూడాలి మరి.

- Advertisement -