అందగత్తె కాదు మోసగత్తె :లీలానీ

345
- Advertisement -

ప్రపంచంలో ఉన్న స్త్రీలను పొగడటం చాలా కష్టం కానీ వారికి అందాల పోటీలను పెడితే సరిపోతుంది కదా… అని అనుకున్నారు. అందుకే 71 సంవత్సరాల కింద హెరిక్‌ మోర్లీ చేతుల మీదుగా ఇంగ్లాండ్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పోటీలో పాల్గొనేందుకు చాలా దేశాల నుంచి అందగత్తెలు వస్తుంటారు. కానీ 2000వ సంవత్సరంలో చీట్‌ చేసి మిస్‌ వరల్డ్‌గా ఎంపికైయ్యారని ప్రముఖ మిస్‌ బార్బడోస్‌ అయిన లీలానీ మక్కనీ ఆరోపించారు.

ఆమె ఏవరో కాదు…ప్రియాంక చోప్రా..2000వ సంవత్సరంలో మిస్‌వరల్డ్‌గా గెలిచారు. అయితే ఆమె చీట్‌ చేసి మిస్‌ వరల్డ గా నిలిచిందని ఆ షోలో ప్రియాంక కో కంటెస్టెంట్‌గా ఉన్న లీలానీ సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. లీలానీ కి యూట్యూబ్‌ ఛానెల్‌ ఉంది. అందులో మిస్‌ వరల్డ్‌2000 గురించి ప్రస్తావించింది. అందులో తాజాగా ఓ వీడియోని విడుదల చేసింది.

 ఇటీవలే జరిగిన మిస్ యూఎస్ఏ పోటీలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించింది. అలాగే 20 ఏళ్ల క్రితం మిస్ వరల్డ్ 2000 సందర్భంగా కూడా ఇలాగే జరిగిందని ప్రియాంక చోప్రాపై సైతం విమర్శలు చేసింది. ఆ వీడియోలో లీలాని మాట్లాడుతూ.. మిస్ వరల్డ్‌ 2000లో నేను ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాను. నేను మిస్ బార్బడోస్‌గా నిలిచిన ఏడాదే తను మిస్ ఇండియాగా గెలిచింది. ఆ షోకి ఇండియన్ కేబుల్ జీ టీవీ స్పాన్సర్. వాళ్లే తర్వాత మిస్ వరల్డ్‌కి కూడా స్పాన్సర్ చేశారు. అందుకే ప్రతి విషయంలోనూ వారి హస్తం ఉంది.

ప్రియాంకతో నా ఏకైక సమస్య ఏమిటంటే.. పోటీలో ఉండగా ఆమె గురించి తెలుసుకోవడం. అప్పుడే ఆమెందుకో నాకు నచ్చలేదు. కానీ మేఘన్ మార్క్లే బెస్ట్ ఫ్రెండ్ కావడంతో అందరి దృష్టి ఆమె మీదే ఉండేది. షో మొత్తంలో పొడుగు డ్రెస్ ధరించడానికి కేవలం ప్రియాంక చోప్రాకి మాత్రమే అనుమతి లభించింది. ఆమె స్కీన్ టోన్‌లో కొంచెం సమస్య ఉంది. అందుకే దానిని కవర్ చేయడానికి రకరకాల క్రీమ్స్ రాసేది. అయినా చర్మంలో ఎటువంటి మార్పు లేదు. అందుకే షో చివరి వరకు అలాగే పొడుగు డ్రెస్స్‌లో ఉండిపోయింది అని చెప్పుకొచ్చింది.

మీరు పోటీలో పోటీదారుగా ఉండి, ఎవరైనా మీకు అనుకూలంగా ఉంటే.. అప్పుడు మీరు ఏమి చేస్తారు?. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారు కదా. అందుకే మిస్ వరల్డ్‌లో, ప్రియాంక చోప్రా గెలుస్తుందని అందరికీ తెలుసు. ఆమె రిగ్గింగ్ చేయడం వల్ల మాత్రమే ఆ పోటీలో విజేతగా నిలవగలిగింది అని తెలిపింది. కాగా.. ఈ విమర్శలపై ప్రియాంక చోప్రా ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి మరీ.

ఇవి కూడా చదవండి..

ఒకే సారి 32 మందితో వీడియో కాల్‌!

ఎగ్జిట్‌పోల్‌ సర్వేల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

బిచ్చగాడు-2 ఎప్పుడంటే…

- Advertisement -