చిరంజీవితో ప్రియమణి కుదిరింది

30
- Advertisement -

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెలకు ఎప్పటి నుంచో పెద్ద నిర్మాత కావాలని ఆశ. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్ అనే బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు మెగా 156వ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాకి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోనే చిరంజీవితో మృణాల్ రొమాన్స్ చేయనుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో ప్రియమణి ని సెకండ్ క‌థానాయిక‌గా ఎంచుకొంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్పటికే ఈ సినిమాలో ప్రియమణి ని ఖాయం చేసేసింది చిత్ర‌బృందం. ఈ మేర‌కు ఓ అధికారిక ప్ర‌క‌ట‌న కూడా త్వరలోనే విడుద‌ల కానుంది. కల్యాణ్‌ కృష్ణ సినిమాల్లో క‌థానాయిక పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమాలోనూ అంతే. ప్రియమణి పాత్ర‌కు మంచి నటి ఉన్న క‌థానాయిక అవ‌స‌రం ఉంది. అందుకే, ప్రియమణి ని ఎంచుకొన్నారు. పైగా మెగాస్టార్ చిరంజీవి, ప్రియమణి కాంబో కూడా కొత్త‌గా అనిపిస్తుంది. కాంబో ప‌రంగా…ఇప్ప‌టికే ఈ సినిమా మంచి క్రేజ్ సంపాదించుకొంది. చిరంజీవి న‌టిస్తున్న 156వ చిత్ర‌మిది.

అన్నట్టు ఈ సినిమాలో ఓ కీల‌కపాత్రలో అల్ల‌రి న‌రేష్ న‌టించ‌నుండ‌టం ఆల్మోస్ట్ ఖాయ‌మ‌ని తెలుస్తోంది. త‌ను ఇప్ప‌టికే ఒప్పుకున్న సినిమాను కొంచెం ఆపి మ‌రీ మెగా సినిమా చేయ‌నున్నాడ‌ట అల్ల‌రి న‌రేష్. కాకపోతే, ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కానుంది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కాలికి సర్జరీ అయ్యింది. అందుకే ప్రస్తుతం మెగాస్టార్ విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

Also Read:చిచ్చు పెట్టేందుకు మోడీ.. రెడీ?

- Advertisement -