ప్రియమణి..పాన్ ఇండియా సినిమా

98
Priyamani
- Advertisement -

తెలుగు, తమిళ, మళయాల చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియమణి . ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తన నటనతో పాటు పొదుపైన సొగసైన అందాలతో కుర్రకారు మతిపొగట్టోంది. పెళ్లి అయినప్పటి నుంచి వెండితెరకు దూరమైన ఈ భామ బుల్లితెరపై ప్రస్తుతం హోస్ట్ గా దర్శనమిస్తోంది. ఇక ఇటీవలె వెండితెరపై నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ప్రియమణి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ రాణిస్తోంది.

తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది ప్రియమణి. డాక్టర్ 56 అనే చిత్రంతో నటిస్తుండగా ఈ చిత్రాన్ని ప్రముఖ బ్యానర్ శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయగా ప్రియమణి లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్‌ అందిస్తుండగా, రాజేష్‌ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్ మీద ఈ సినిమాను ప్రవీణ్‌ రెడ్డి. టి నిర్మిస్తున్నారు.

- Advertisement -