నేను చాలా హ్యాపీ: ప్రియా వారియర్

262
Priya Prakash Warrier Reaction On Supreme Court Order
- Advertisement -

ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ‘ఒరు అదర్ లవ్’ సినిమాలోని ‘మాణిక్య మలరయ పూవీ’ సాంగ్‌లో ఓ వర్గాన్ని కించపరిచే విధంగా లిరిక్స్ ఉన్నాయని.. ప్రియా, సినిమా డైరెక్టర్ ఒమర్ లులుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. బుధవారం(నేడు) సుప్రీంకోర్టు ఆమెపై నమోదైన కేసుల నుంచి ఊరట కల్పించింది. యితే ఈ విషయమై ప్రియా తాజాగా స్పందించింది.

Priya Prakash Warrier Reaction On Supreme Court Order

”మాలాగా ఎవరైతే తమ కెరీర్‌ని స్టార్ట్ చేసి ఉంటారో.. వారు ఇలాంటి ఘటనలు జరిగితే చాలా టెన్సన్‌ అవుతారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు’’ అని ప్రియా తెలిపింది.

ఇదిలా ఉండగా..తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రపంచాన్ని ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాను నటించిన ‘ఒరు అదర్ లవ్’ విడుదల తర్వాతే..తన సినీ కెరీర్‌ ని పక్కా ప్లానింగ్‌ తో ఓ గాడిలో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది ప్రియా వారియర్‌.

- Advertisement -