- Advertisement -
అతిలోక సుందరి శ్రీదేవికి అద్భుతమైన నివాళి అర్పించింది ప్రియా ప్రకాశ్ వారియర్. తన చూపులతో దేశం మొత్తాన్ని కట్టిపడేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన ప్రియా…మంచి సింగర్ కూడా. అందుకే ఓ మాంచి పాటతో శ్రీదేవికి ఆమె నివాళి అర్పించిది. ‘కభి అల్విద న కెహనా..’ అంటూ ప్రియా ఓ ట్వీట్ చేసింది.
చరిత్ర ఎప్పుడూ గుడ్‌బై చెప్పదని, మళ్లీ కలుస్తా అనే అంటుందని ఆ ట్వీట్లో ప్రియా రాసింది. అయితే శ్రీదేవి మృతదేహం అప్పగింతపై జరిగిన డ్రామాలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపైనా ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది. సరైన సమాచారం లేకుండా ఇలా ఎందుకు చేస్తున్నారంటూ మరో ట్వీట్లో ప్రశ్నించింది ప్రియా వారియర్.
https://twitter.com/priyapvarrier/status/968329033711783936
https://twitter.com/priyapvarrier/status/968173414522355712
- Advertisement -