ఈ పిల్ల కన్నుకొడితే…బన్నీ కూడా ఫిదా అయ్యాడు..!

227
- Advertisement -

ప్రియా ప్రకాశ్‌ వారియర్..మొన్నటి వరకూ ఈ అమ్మడు ఎవరో కూడా చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సోషల్‌ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది. ఇప్పుడు సోషల్‌మీడియా స్టార్‌ అయిపోయింది ఈ హీరోయిన్‌. ఆమె నటించిన ‘ఓరు అదార్‌ లవ్‌’ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియా, యూట్యూబ్‌లలో హల్‌చల్‌ చేస్తోంది.

  Priya Prakash Varrier wins Allu Arjun's love

ఆ వీడియోకు యూత్‌ ఫిదా అయిపోయారు. అయితే తాజాగా టాలీవుడ్‌ టాప్‌ హీరో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఈ అమ్మడి ఎక్స్‌ప్రెషన్స్‌ కి ఫిదా అయ్యాడు. అంతేకాక ఏకంగా తన ట్వీటర్‌ అకౌంట్‌లో ఆ వీడియోను పోస్టు చేశాడు. నేను చూసిన క్యూట్‌ వీడియోల్లో ఇది ఒకటి. ది పవర్‌ ఆఫ్‌ సింప్లిసిటీ. లవ్‌ ఇట్‌’ అని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశాడు.

‘ఓరు అదార్‌ లవ్‌’ చిత్రం మార్చి 3న విడుదల అవుతోంది. ఆ సాంగ్‌లో హీరో హీరోయిన్‌ల కనురెప్పలతోనే మాట్లాడుకుంటారు. వారు కనురెప్పలు ఎగరేయడం, కన్ను కొట్టుకొవడం వంటి హావభావాలతోనే లవ్‌ ప్రపోజ్‌ చేసుకుంటారు. తరగతి గదిలో జరిగే ఈ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ అమ్మాయి హావభావాలే చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -