మలయాళంలో తెరకెక్కుతున్న ఒరు అదర్ లవ్ సినిమాలోని హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ అమ్మడు ఒక్క కన్ను గీటి మొత్తం దేశాన్ని తనవైపు తిప్పుకుంది.. ఒక ట్రైలర్‌తో దేశవ్యాప్తంగా ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ కేరళ కుట్టి ఇప్పుడు నెట్టింట్లో ఏం చేసినా హట్ టాపింక్గా మారుతోంది.. క్యూట్ క్యూట్ లుక్స్ తో చూడ ముచ్చటైన మోముతో ప్రియా విడుదల చేసే వీడియోలకు లక్షల్లో లైక్ లు వస్తున్నాయి. ఈమెను ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
అయితే తాజాగా ఈ కేరళ కుట్టి ఆసియానెట్ అవార్డ్స్-2018 సినీ ఫంక్షన్ లో పాల్గొంది. ఆ కార్యక్రమానికి ఒక పొడవాటి నల్ల గౌనును ధరించి వచ్చింది. ఆ డ్రెస్సులో అందమైన బొమ్మలా కనపడింది. అయితే అసలు విషయం ఏంటంటే.. ఆ డ్రెస్ బరువుగా ఉండడంతో దాన్ని మోయడానికి పడరాని పాట్లు పడింది. ఆ డ్రెస్ మోయడానికి ఆమె ఒక సహాయకురాలిని కూడా నియమించుకుంది.ఆ గౌనును మోసే భారంలో ఆమెను పాలుపంచుకోనిచ్చింది ప్రియ.
ప్రస్తుతం వీడియో బయట రావడంతో అందరూ ప్రియాపై సెటైర్లు వేస్తున్నారు. ఆసియానెట్ ఫంక్షన్ లో ఆమె గేటు నుంచి ఎంతో కష్టపడుతూ గౌను ను మోయలేక.. ఓ అసిస్టెంట్ సాయంతో భారంగా వేదిక మీదకు రావడం వీడియోలో కనిపించింది. ఆమెకు ఎంత స్టార్ డం ఉన్నా.. ఇలా వేదికలపై ఆ దర్పం ప్రదర్శించేందుకు చేసిన ఈ ప్రయత్నం నవ్వులపాలైంది.. సినిమాల్లో ఏదీ వేసినా అదే ఆ షాట్ వరకే అందంగా ఉంటుంది. కానీ బయట కూడా అలాంటి డ్రెస్ లు వేసుకొని ప్రియా పడిన పాట్లు చూశాక అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
#PriyaPrakashVarrier During Asianet film awards. pic.twitter.com/xSO9rSq7hq
— Suhana Khan Fan Club (@suhanakhanfan) May 25, 2018