తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన ఓటు వెలికితీత పనులు ప్రారంభమయ్యాయి. బాలాజీ మెరైన్ సంస్థ ఆధ్వర్యంలో వెలికితీత పనులు జరుగుతుండగా 25 మంది మత్స్యకారులు,నిపుణులు వెలికితీత పనుల్లో పాల్గొన్నారు. క్రేన్,ప్రొక్లెయిన్,బోటు,వైర్ రోప్,లంగర్లు,లైలాండ్ రోప్‌లు,జాకీలు ఉపయోగిస్తున్నారు.
కచ్చులూరు మందం అంటేనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. గోదావరిలో ఇక్కడ పెద్ద సుడిగుండాలు ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం అత్యంత క్లిష్టమైన చర్య. ఈ నేపథ్యంలో కలెక్టర్ మురళీధర్‌రెడ్డి నేతృతంలోని జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. బోటు వెలికితీసే ప్రాంతానికి ఎవరు రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు 144 సెక్షన్ విధించారు.
గోదావరిలో ఈ ఘోర ప్రమాదం జరిగి 15 రోజులైనా గల్లంతైన వారిలో 15 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. బోటులో 77మంది ప్రయాణించగా, 26 మంది సురక్షితంగా బయట పడ్డారు. ఇప్పటివరకు 36 మృతదేహాలను గుర్తించారు.