- Advertisement -
రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. ధావన్ స్ధానంలో చోటు దక్కించుకున్న ముంబై కుర్రాడు పృథ్వీ షా అదరగొట్టాడు. సూపర్ మ్యాన్ షోతో తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు.
ఫస్ట్ ఓవర్ లాస్ట్ బంతికి కేఎల్ రాహుల్ వెనుదిరిగినప్పటికీ ఎక్కడా తడబడలేదు. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ పుజారాతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అచ్చం మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ని తలపిస్తు చక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. వన్డేను తలపిస్తూ తొలి మ్యాచ్‌లోనే 56 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
మరోవైపు పుజారా సైతం హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత్ ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. షా 68 పరుగులతో పుజారా 52 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- Advertisement -