దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌తో వైరల్ రీల్‌ను సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రిన్సి పరీఖ్ తొలగించారు. తనపై అత్యాచార బెదిరింపులు, శరీరాన్ని అవమానించే వ్యాఖ్యలు రావడంతో ఆ వీడియోను డిలీట్ చేసినట్లు ఆమె వెల్లడించారు.
అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారత్‌పై 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో మిల్లర్ అర్థశతకం చేసి 187/7 స్కోర్‌కు జట్టును చేర్చాడు. మ్యాచ్ అనంతరం ప్రిన్సీ పారిఖ్ సరదాగా మిల్లర్ చుట్టూ తిరుగుతూ స్లో క్లాప్ చేస్తూ రీల్‌ను పోస్ట్ చేసింది.
అయితే ఆ వీడియోకు వచ్చిన ప్రతిస్పందన తీవ్రంగా దుర్భాషలతో నిండిపోయిందని ఆమె పేర్కొన్నారు. నాపై గ్రాఫిక్ రేప్ బెదిరింపులు, వందల సంఖ్యలో బాడీ షేమింగ్ కామెంట్లు వచ్చాయి. ఇక భరించలేక వీడియోను తొలగించాను. ఈ పరిస్థితిలో కనపడకుండా పోవాలనిపిస్తోంది అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశారు.
ఇలాంటి బెదిరింపులు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, వారి యూజర్‌నేమ్‌లు, మెసేజ్‌లను బయటపెడతానని ఆమె హెచ్చరించారు.
Also Read:షూతో కీళ్ల నొప్పులు..షాకింగ్!

Also Read:షూతో కీళ్ల నొప్పులు..షాకింగ్!

