దాదాపు రెండు వారాల కిందట సినిమా షూటింగ్‌లో ఇద్దరు స్టంట్ మాస్టర్స్ చనిపోయారు. అయితే సరిగ్గా అలాంటి తరహాలోనే ఓ ప్రమాదం జరిగినా చివరికి ఆ నటుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు రెండు వారాల కిందట సినిమా షూటింగ్‌లో ఇద్దరు స్టంట్ మాస్టర్స్ చనిపోయారు. అయితే సరిగ్గా అలాంటి తరహాలోనే ఓ ప్రమాదం జరిగినా చివరికి ఆ నటుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
ప్రిన్స్ నరుల… టీవీ తెరపై రాణిస్తున్న నటుడు. బిగ్ బాస్ షో విన్నర్ కూడా. ఓ షో కోసం ప్రిన్స్ ఉరివేసుకుంటున్న దృశ్యం చిత్రీకరిస్తుండగా, ప్రమాదవశాత్తూ మెడకు బిగుసుకున్న ఉరి దాదాపు ఆయన ప్రాణాలను తీసినంత పని చేసింది. కాలు కింద ఉన్న కుర్చీ పక్కకు జరగడంతో ప్రిన్స్ మెడకు ఉరి బిగుసుకుంది. డైరెక్టర్ కట్ చెప్పలేదు. ఆపై తాడు బిగుసుకుని కేకలు పెడుతున్న ప్రిన్స్ ను యూనిట్ సిబ్బంది పరుగున వెళ్లి కాపాడారు.
ఆ నటుడి మెడకు స్వల్పగాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. ఈ ఘటనపై నటుడు ప్రిన్స్ నరులా మాట్లాడుతూ.. ‘నా కాలు కింద ఉన్న కుర్చీ పక్కకు జరగడంతో నిజంగానే చాలా భయపడ్డాను. మెడకు తాడు ఉన్నా కూడా డైరెక్టర్ కట్ చెప్పకుండా షూటింగ్ కంటిన్యూ చేశాడు. ఆ సీన్ చూస్తే అభిమానులు థ్రిల్ అవుతారని బిబ్ బాస్ మాజీ విన్నర్ చెప్పుకొచ్చాడు.