మహేశ్‌ బాబుతో సందీప్ వంగ..!

256
sandeep
- Advertisement -

అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ వంగ. ఈ మూవీ తర్వాత అటూ బాలీవుడ్‌లోనూ తన సత్తాచాటిన సందీప్‌…తాజాగా మహేశ్‌ బాబుతో ఓ యాడ్‌ చేయనున్నాడు.

ఈ యాడ్‌లో మహేశ్‌ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి ఆగడు, సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చేయగా తాజాగా హవెల్స్‌ ఎలక్ట్రిక్‌ బల్బుల యాడ్‌లో నటిస్తున్నారు.

ప్రస్తుతం మహేశ్‌ తన 27వ చిత్రం సర్కారువారి పాట చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. తదుపరి షెడ్యూల్‌ దుబాయ్‌లోనే జరగనుంది. ఈ షెడ్యూల్‌ గ్యాప్‌లో మహేశ్‌ కమర్షియల్‌ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

- Advertisement -