బాహుబలి2పై ప్రిన్స్‌ ట్వీట్‌..

226
- Advertisement -

బాహుబలి2పై  ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి2 ఏకంగా 125 కోట్ల వసూళ్లను రాబట్టి భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది స్క్రీన్లపై బాహుబలి-2 ప్రదర్శితమైంది. దేశంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన బాహుహలి2 తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ సినీరంగ చరిత్రలో మరే చిత్రానికీ సాధ్యం కాని మహాద్బుతాన్ని సృష్టించింది.
prince mahesh babu tweets on bahubalai
ఇక ఈ సినిమాపై ఇప్పటికే ప్రముఖ స్టార్లు  ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో పిన్స్‌ మహేష్‌ బాబు కూడా బాహుబలి2 పై తనదైన స్టైల్‌ లో ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా బాహుబలి టీం ను ఆకాశానికి ఎత్తేశారు ప్రిన్స్‌. ముఖ్యంగా రాజమౌళిని కథ చెప్పడంలో మాస్టర్ గా కీర్తించిన మహేష్, బాహుబలి 2 అంచనాలను దాటింది అంటూ ట్వీట్ చేశాడు.

ఇదిలాఉంటే.. బాహుబలి 2 తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా ప్రచారం జరుగుతుండగా తొలి వారాంతంలో ఈ సినిమా 300 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకున్న ఇండియన్ సినిమా రికార్డ్ లన్ని చెరిపేస్తున్న బాహుబలి2 రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేయటం కాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

 prince mahesh babu tweets on bahubalai

- Advertisement -