GIC:హరితసేనలో ఆలయ అర్చకులు

7
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంగా పెళ్లి రోజు సందర్బంగా 25 మొక్కలు జగదేవ్పూర్ ప్రముఖ దేవస్థానం మధునదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో మొగిలి లలిత నరసింహారెడ్డి గార్ల పెళ్లిరోజు సందర్భంగా, ఆలయ ప్రధాన అర్చకులు ఇట్టి రెడ్డి- అర్చన- శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 25 మొక్కలు మొక్కలు నాటారు.

గజ్వేల్ నియోజకవర్గ హరితసేన ఇంచార్జ్ మరియు సినీ హీరో అనిల్ మొగిలి గారి తల్లితండ్రులు మొగిలి లలిత నరసింహారెడ్డి గార్ల 38వ వివాహ వార్షిక పెళ్లిరోజు సందర్భంగా జగదేవ్పూర్ మండల్ లోగల స్థానిక ప్రముఖ దేవస్థానం మధునదుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది .

మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు గారి పిలుపుమేరకు వారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో 25 మొక్కలు నాటడం జరిగింది….ఈ కార్యక్రమంలో మొగిలి లక్ష్మి, వశిష్ట రెడ్డి, ఆలయ పెద్దలు, ఇట్టిరెడ్డి -హనుమంత రెడ్డి, సువర్ణ రెడ్డి,వెంకట్ రెడ్డి, రమ,
ఇట్టి రెడ్డి -అర్చన శ్రీధర్ రెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read:ఎగ్గొట్టిన రైతు భరోసా ఏది?: కేటీఆర్

- Advertisement -