అతిమూత్ర సమస్యను తగ్గించే చిట్కాలు!

69
- Advertisement -

నేటిరోజుల్లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు సర్వసాధారణంగా మారాయి. దాంతో వాటిపై పెద్దగా శ్రద్ద చూపడం లేదు చాలమంది ఫలితంగా చిన్న సమస్యలే పెద్ద ఆరోగ్య సమస్యలుగా మారి దీర్ఘకాళిక వ్యాధులకు నాంది పలుకుతాయి. కాబట్టి సమస్య ఏదైనా దానికి తగిన నివారణ చేపట్టడం చాలా అవసరం. చాలమందికి అతిమూత్ర సమస్య ఉంటుంది. నీరు త్రాగిన ఐదు లేదా పది నిముషాల లోపే మూత్ర విసర్జనకు వెళ్ళడం కొందరిలో నీరు తక్కువగా తగినప్పటికి మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుండడం వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా షుగర్ వ్యాధి గ్రస్తులలలో ఈ తరహా లక్షణాలు కనిపిస్తాయి.

అయితే ఇలా అతిమూత్ర సమస్యకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కార చిట్కాలు ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎండబెట్టిన నేరేడు గింజలను చూర్ణంగా చేసి మర్రి చెట్టుయొక్క బెరడుతో చేసిన కషాయంతో కలిపి సేవిస్తే అతిమూత్ర సమస్య తగ్గుతుందట. వెల్లుల్లి రేకుల్ని ఉదయం ఐదు రెబ్బలు సాయంత్రం ఐదు రెబ్బలు తింటే కూడా ఈ సమస్య తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గులకందను తురుముగా చేసుకొని ప్రతిరోజూ ఉదయం సాయంత్రం సేవించడం వల్ల కూడా అతిమూత్ర సమస్య తగ్గుతుందట. అడవి పొన్న మ్రాను చెక్కలను శొంఠితో కలిసి చూర్ణం చేసుకొని ప్రతిరోజూ ఉదయం పడగడుపున సేవిస్తే ఈ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చట. ఇంకా పటిక బెల్లం, మరియాలు, శొంఠి మూడింటిని చూర్ణంగా చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ నేతిలో కలుపుకొని తాగడం వల్ల కూడా ఈ అతిమూత్ర సమస్య తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు.

Also Read:సోనాక్షి సిన్హా వివాహంపై శత్రుఘ్న సిన్హా

- Advertisement -