తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విత్తన పార్కు ఏర్పాటు చేయబోతుంది. ఈ విత్తన పార్క్‌పై అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలోని ఓ బృందం రాష్ట్రంలో పర్యటించారు. వీరితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన విత్తన ధ్రువీకరణ సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ విత్తన రంగ అభివృద్ధి కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. విత్తన పార్క్ ప్రస్తుత పురోగతి ప్రణాళికలు దాని ఉపయోగల గురించి విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత వ్యవసాయ రంగం అభివృద్ధి కి అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు శాఖ కార్యదర్శులు, డైరెక్టర్‌లతో యూపిలో ఒక్క ప్రత్యేక సమావేశంని ఏర్పాటు చేయలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం విత్తన రంగ అభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతోంది. దేశంలోనే ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా విత్తనాలను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ.విత్తన పార్క్ అభివృద్ధికి విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, గోదాముల, అధునాతన శీతల గిఫ్దంగులు,ల్యాబులు, 150 ఎకరాలలో ఏర్పటు చేయడానికి ప్రణాళికలు రూపొందించామని ఆయన అన్నారు.తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై అతిపెద్ద మల్టి లెవల్ ప్రాజెక్టులు నిర్మించి 40 లక్షల ఎకరాలకు నీరండిస్తున్నాం.కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించాలని యూపీ మంత్రిని కోరాము. త్వరలోనే అన్ని రాష్ట్రాల విత్తన కార్పొరేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని నిరంజన్ రెడ్డి తెలిపారు.
యూపీ వ్యవసాయ శాఖ మంత్రి సూర్యప్రతాప్ సాహి మాట్లాడుతూ.. గత సంవత్సరం ఒఈసీడీ విత్తన ధ్రువీకరణ గురించి అధ్యయనం చేయడానికి వచ్చామని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసి టీఆర్ఎస్ ప్రభుత్వమే రెండో సారి కూడా అధికారంలోకి వస్తుందని అనుకున్నాను.కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడం ఎంతో గొప్ప అని రైతు బంధు పథకం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.విత్తన రంగంలో తెలంగాణ ఏంతో ప్రగతి సాధించింది.తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని యూపీ లో కూడా విత్తన పార్క్ కోసం ప్రణాళికలు రూపొందిస్తాం. విత్తన రంగంలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించి తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఉత్తర్ ప్రదేశ్‌లో కూడ విత్తన పార్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి సూర్యప్రతాప్ సాహి అన్నారు.