ఫిబ్రవరి 21న ‘ప్రెజర్ కుక్కర్’

378
Pressure-Cooker-Movie-
- Advertisement -

సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. ‘ప్రతి ఇంట్ల ఇదే లొల్లి’ అనేది ఉప శీర్షిక. కారంపురి క్రియేషన్స్ , మైక్ మూవీస్ పతాకాలపై సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి (‘జార్జిరెడ్డి’ ఫేమ్) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజోయ్, సుశీల్ దర్శకులు. అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది. శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటరులో జరిగిన కార్యక్రమలో సినిమా పోస్టర్ ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన అప్పిరెడ్డి మాట్లాడుతూ, “మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులూ గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వినోదం, సందేశం మేళ్ళవించిన సినిమా. పాటలు, రీరికార్డింగ్ సినిమాకు ప్లస్సవుతాయి. రాహుల్ సిప్లిగంజ్ రెండు పాటలు పాడారు. అందరూ గర్వపడే సినిమా. ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్న అభిషేక్ నామాకు ధన్యవాదాలు” అని చెప్పారు.

దర్శకుల్లో ఒకరైన సుజోయ్ మాట్లాడుతూ, “ఫస్ట్ టైం సినిమా ఫీల్డులోకి వచ్చినా ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ సినిమా తీశాం. ఈ ప్రాసెస్ లో చాలా నేర్చుకున్నాం. ఇండస్ట్రీలోని సీనియర్ల నుంచి సలహాలు తీసుకొని, అంతా బాగుందని సంతృప్తి చెందాకే విడుదలకు సిద్ధమవుతున్నాం. ఇది న్యూ ఏజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తండ్రీ కొడుకుల అనుబంధం, తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకు మధ్య అనుబంధంతో ఈ సినిమా ఉంటుంది. పిల్లలు వేరే దేశాంలో ఉంటే కుటుంబంపై, సమాజంపై దాని ప్రభావం ఎలా పడుతుందనేది ఇందులోని ప్రధానాంశం. మా వ్యక్తిగత అనుభవాలతో పాటు, అనేకమంది అనుభవాలను జోడించి ఈ కథ రాశాం. అభిషేక్ నామా మాకు సపోర్టుగా నిలిచి సినిమాని విడుదల చేస్తున్నారు” అని తెలిపారు.

మరో దర్శకుడు సుశీల్ మాట్లాడుతూ, “హైదరాబాద్ వాడుక భాషలో ఉండే సంభాషణలు ప్రేక్షకుల్ని అలరిస్తాయని ఆశిస్తున్నాం. ‘ప్రెజర్ కుక్కర్’ అనేది మన ఇంట్లో లేదా పక్కింట్లో జరిగే కథలా అనిపిస్తుంది. ఈ కథ చెప్పగానే నిర్మాణంలో భాగస్వామి కావడానికి అప్పిరెడ్డి ముందుకొచ్చారు. అలాగే సినిమా పూర్తయి చూపించాక డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి అభిషేక్ ముందుకు వచ్చారు. వాళ్లిద్దరికీ థాంక్స్” అని చెప్పారు.

హీరో సాయిరోనక్ మాట్లాడుతూ, “ఇదివరకు వచ్చిన అమెరికా నేపథ్యం సినిమాలతో పోలిస్తే ఈ సినిమా డిఫరెంటుగా ఉంటుంది. పిల్లలు సహా ఒక ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసే సినిమా. కుటుంబ విలువలు ఉన్న సినిమా. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసే అల్లరి ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. సినిమాకు టీజర్, సాంగ్స్ మంచి బజ్ తీసుకొచ్చాయి. అభిషేక్ నామా రాకతో ఆ బజ్ డబుల్ అయ్య్యింది” అన్నారు.

చిత్ర సమర్పకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ, “ఈ సినిమా చూడగానే కనెక్టయిపోయా. కొడుకు యు.ఎస్.కు వెళ్తే ఒక తండ్రి ఎంతగా తల్లడిల్లుతాడో ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. దర్శకులు సినిమాని చాలా బాగా తీశారు. ఒక సినిమా రిలీజుకు ఎప్పుడూ పడనంత ప్రెజర్ ఈ సినిమాకు పడ్డాను. ఎట్టకేలకు మంచి డేట్ చూసుకొని మహాశివరాత్రికి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి” అన్నారు.

- Advertisement -