మార్చి 5 నుంచి ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్..

456
Premier Handball League
- Advertisement -

ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ గ్లామర్ తీసుకొచ్చేందుకు కొద్ది రోజులుగా ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్ చైర్మన్, హ్యాండ్ బాల్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్ ఆటగాళ్ల వేలం కాన్పూర్‌లో అట్టహాసంగా జరిగింది. లీగ్ వేలంలో పీహెచ్ఎల్ చైర్మన్ జగన్మోహన్ రావు, హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామ సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి ఆనందేశ్వర్ పాండే, జట్టు యాజమాన్యులు, తదితరులు పాల్గొన్నారు.

లీగ్‌లో మొత్తం ఆరు జట్లు తలపడుతున్నాయి. ‘తెలంగాణ టైగర్స్, ధాకడ్ ఢిల్లీ, బెంగాల్ బ్లూస్, రెడ్ హాక్స్ రాజస్థాన్, యూపీ ఐకాన్స్, తమిళ్ వీరాన్స్’. ప్రతి టీమ్‌ ముగ్గురు విదేశీయులు, ఇద్దరు స్వరాష్ట్ర ప్లేయర్లతో పాటు మొత్తం 12 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. వీరితో పాటు ‌ఒక కోచ్‌ సహా ఇద్దర్ని సహాయ‌ సిబ్బందిగా కూడా ఫ్రాంచైజీలు నియమించుకున్నాయి. జైపూర్ వేదికగా వచ్చే నెల మార్చి 5 నుంచి 23 వరకు ఈ లీగ్ జరగనుంది.

ఈ సందర్భంగా పీహెచ్ఎల్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. లీగ్ ఏర్పాటుకు ఫెడరేషన్ లోని ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా కృషి చేశారని అన్నారు. లీగ్‌ను విజయవంతం ‌చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని ఆయన ‌తెలిపారు. దేశీయ యువ క్రీడాకారులు తమ‌ ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ‌ లీగ్ చక్కని వేదికని చెప్పారు. ఇలాంటి అవకాశాలను వర్థమాన క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో రాణించి.. దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని జగన్మోహన్ రావు ఆకాంక్షించారు.

- Advertisement -