మళ్లీ ఆ సీన్స్ చేయను…

253
-Sai Pallav
- Advertisement -

‘ఫిదా’ సినిమాతో సాయిపల్లవి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె నాని జోడీగా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమా చేస్తోంది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  మలయాళంలో ‘ప్రేమమ్‌’లో నటిస్తున్నప్పుడు సీతాకోక చిలుకల మధ్య ఓ షాట్‌ తీశారు. ఆ షాట్‌ని మేం ప్లాన్‌ చేయలేదు.  ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో ..  గుప్పెట్లో సీతాకోక చిలుకను ఉంచి .. కొన్ని క్షణాల తరువాత గుప్పెట తెరచి దానిని గాల్లోకి వదిలి సాయిపల్లవి ఆనందించాలి. అయితే సీతాకోకచిలుకను గుప్పెట్లో ఉంచి .. తెరిచేలోగా దానికి ఏమైనా అవుతుందేమోనని ఆమె చాలా టెన్షన్ పడిపోయిందట.

sai pallavi

తాను  సహజంగా ఉండటం అంటే ఇష్టం.  వానలో తడవడమంటే నాకు ఇష్టం. హరివిల్లును చూడటం ఇంకా ఇష్టం. ఎలాంటి టెన్షన్లూ లేకుండా, సీతాకోకచిలుక లాగా ఎగరాలని ఉంటుంది.   ప్రకృతి అంటే ప్రాణం’’ అని అలాంటి వాటిని ఇబ్బంది పెట్టడం తనకి ఎంత మాత్రం ఇష్టం ఉండదనీ .. మరోసారి అలాంటి సీన్స్ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పింది. ప్రకృతిని ఆరాధించడం . అందులోని జీవరాశిని చూసి ఆనందించడం చేయాలి తప్ప, దేనికీ హాని చేయకూడదని చెప్పుకొచ్చింది.

- Advertisement -