ప్లేబాయ్ “ప్రేమ పిపాసి” గా ఎందుకు మారాడు..?

174
- Advertisement -

జీపీయ‌స్ హీరోగా యూత్ ఫుల్ ల‌వ్ అండ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌చ్చిన చిత్రం ప్రేమ‌పిపాసి. లాస్ట్ ఇయ‌ర్ విడుద‌లైన ఈ చిత్రానికి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా స‌క్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోన్న క్ర‌మంలో క‌రోన వ‌ల్ల థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. దీంతో సినిమా చాలా మంది చూడ‌లేక‌పోయారు. ఇటీవ‌ల ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో (USA UK)విడుద‌లై వ‌న్ మిలియ‌న్ వ్యూస్‌తో మంచి టాక్ తెచ్చుకుంది. ఇండియాలో mx player, hungama, xtream మొదలగు OTT ల్లో టెలి కాస్ట్ అవుతోంది.

ఈ సంద‌ర్భంగా హీరో జీపీయ‌స్ మీడియాతో మాట్లాడుతూ… `ప్రేమ పిపాసి చిత్రాన్ని లాస్ట్ ఇయ‌ర్ రిలీజ్ చేశాం. యూత్ మా సినిమాను మంచి హిట్ చేశారు. మంచి టాక్ తో మా సినిమా దూసుకుపోతున్న స‌మ‌యంలో మా బ్యాడ్ ల‌క్ … క‌రోన వ‌ల్ల థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. ఆ తర్వాత సెకండ్ రిలీజ్ చేద్దామ‌నుకున్నాం కానీ కుద‌ర్లేదు. దీంతో ఇటీవ‌ల యుఎస్, యుకే ల్లో మా సినిమాను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశాం. వ‌న్‌ మిలియ‌న్ వ్యూస్ తో మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది.

అలాగే ఇండియాలో mx player, hungama, xtream మొదలగు OTT ల్లో టెలి కాస్ట్ అవుతోంది. థియేట‌ర్ల‌లో మిస్సైన వారు చూడండి. క‌చ్చితంగా యూత్‌కి సినిమా న‌చ్చుతుంది. సెకండాఫ్ అస్సలు మిస్స‌వ్వద్దు. మీరు మూవీ రివ్యూస్ చ‌దివి, యూట్యూబ్‌లో ప‌బ్లిక్ టాక్ చూసి మా సినిమా చూడండి. సెకండాఫ్ మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ప్ర‌స్తుతం అమ్మాయిలు ఎలా ఉన్నారు అనేది సినిమాలో చూపించాం. ల‌వ్ ఫెయిల్యూర్స్ మా సినిమా చూస్తే వాళ్ల డెసిష‌న్ మార్చుకుంటారు. మా సినిమాను చూసి లైక్ చేయండి, షేర్ చేయండి.ప్లేబాయ్ ప్రేమ పిపాసిగా ఎందుకు మారాడు అనేది క‌థ‌. అంద‌రూ చూడండి సినిమా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా త‌ర్వాత నాకు రెండు మూవీస్ లో హీరోగా న‌టించే అవ‌కాశాలు వ‌చ్చాయి. త్వ‌ర‌లో వాటి వివ‌రాలు వెల్ల‌డిస్తా. ‘ప్రేమ పిపాసి ‘ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు ” అన్నారు.

- Advertisement -