బిడ్డ కోసం గర్బిణి పొట్టకోసి..చంపేశారు..!

198
chicago

ఇప్పటివరకు మనం ఆస్పత్రిలో పసికందు మాయం..ఇంటిబయట ఆడుకుంటున్న పిల్లలని ఎత్తుకెళ్లిన దుండగులు..పిల్లలని ఎత్తుకెళ్లే దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే వార్తలు వినుంటాం. కానీ ఇది అత్యంత హేయమైన చర్య. గర్భంలో బిడ్డ ఉండగానే ఓ తల్లి పొట్టకోసి దారుణంగా హతమార్చి బిడ్డని తీసుకొని పరారైంది ఓ మహిళ. చికాగోలో జరిగిన ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది.

చికాగోకు చెందిన 19 ఏళ్ల మార్లెన్ ఓచోయో లోపెజ్ తొమ్మిది నెలల గర్భిణి. ఆమెకు ఫేస్‌బుక్‌లో ఓ ఫ్రెండ్ పరిచయమైంది. పుట్టబోయే బిడ్డకు బట్టలిస్తాను అని చెప్పడంతో ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది మార్లెన్. అప్పటినుండి ఆమె కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

Marlen

కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మార్లెన్ కాల్ డేటా,ఫేస్ బుక్‌ పేజ్‌లో ఉన్న ఫ్రెండ్స్ లిస్టుని పరిశీలించారు. అందులో ఓ మహిళ తన ఇంటికి వస్తే పుట్టబోయే బిడ్డకు బట్టలిస్తానని మార్లెన్ గర్భంతో ఉన్న ఫోటో కింద కామెంట్ పెట్టింది. ఇందుకు మార్లెన్ అంగీకరిస్తూ రిప్లై ఇచ్చింది. దీంతో పోలీసులు సదరు మహిళ ఇంటికి వెళ్లిచూడగా అసలు విషయం వెలుగుచూసింది. మార్లెన్ చేత బలవంతంగా బిడ్డను ప్రసవించేలా చేయడం కోసం ఆమె పొట్టపై గట్టిగా ఒత్తారు..ఎంతకు డెలివరీ కాకపోయే సరికి పొట్టకోసి బిడ్డను ఎత్తుకెళ్లారు. విఘతజీవిగా పడి ఉన్న మార్లెన్‌ను కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.