ప్రీ లుక్‌ : మహానటి

220
pre look mahanati Savithri
- Advertisement -

అలనాటి మహానటి సావిత్రిగా సమంత నటించబోతున్నారు. దశాబ్దాల పాటు వెండితెరై వెలిగిన సావిత్రి జీవితకథతో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే ఎవడే సుబ్రమణ్యం తో విజయాన్ని అందుకున్న నాగ్ అశ్విన్ తర్వాత మరో సినిమా చేయలేదు. సుదీర్ఘకాలం సావిత్రి కథపైనే కసరత్తులు చేశారు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేశారు.

అలనాటి మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ వెండితెరపై రాబోతున్న సంగతి తెలిసిందే. దశాబ్దాల పాటు వెండితరపై వెలుగు వెలిగిన సావిత్రి జీవిత కథను యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యంతో విజయాన్ని అందుకున్న నాగ్ అశ్విన్ తర్వాత మరో సినిమా చేయలేదు. ఇప్ప‌టికే క‌థ‌కు సంబంధించి ప‌నులు కూడా పూర్త‌య్యాయి. ఈ సినిమాలో  నేను శైల‌జ ఫేం కీర్తీ సురేష్ లీడ్ రోల్ పోషిస్తుంద‌ని రైట‌ర్ సాయి మాధ‌వ్ తెలిపారు. అలాగే స‌మంగ కూడా ఓ ఇంపార్టెంట్ పాత్ర‌కు చూజ్ చేసిన‌ట్లు తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, గుమ్మడి, జెమిని గణేశన్ పాత్రలు కూడా ఈ సినిమాలో క‌నిపిస్తాయ‌ని అశ్వినీద‌త్ తెలిపారు.

ఇక ఈ సినిమాలో సావిత్రి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఉమెన్స్ డే సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన దర్శకుడు మరింత కన్ఫ్యూజన్ పెంచాడు. మాయబజార్ సినిమాలోని సావిత్రి స్టిల్, వెనుక ఒకవైపు కీర్తి సురేష్, మరోవైపు సమంత ఫోటోలను యాడ్ చేశారు. అయితే ఈ ఇద్దరిలో సావిత్రిగా ఎవరు కనిపించబోతున్నారన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ‘తరాలను నిర్మించే స్త్రీ జాతికోసం, తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ’ అనే లైన్ తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో టైటిల్ ను మాత్రం రివీల్ చేయలేదు. అదే సమయంలో ఈ చరిత్రలో భాగమయ్యేందుకు మీరు ముందుకు రండి అంటూ కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చారు.

pre look mahanati Savithri

- Advertisement -