30 కోట్ల క్లబ్‌లో ప్రతిరోజు పండగే..!

525
prathiroju pandage
- Advertisement -

సాయి తేజ్ మరో డిఫరెంట్ హిట్ అందుకున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన “ప్రతి రోజు పండగే” సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న చిత్ర యూనిట్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది.

ఇక ఇప్పటివరకు రూ. 30 కోట్లు రాబట్టిన ఈ మూవీ సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 26 కోట్లు రాబట్టగా కర్నాటకలో 2 కోట్లు…ఓవర్సీస్‌లో మరో 2 కోట్లు వసూళ్లు చేసింది.

వరుసగా ఆరు ఫ్లాప్‌ల తర్వాత సాయి ధరమ్‌కు నిజంగానే పండగ తీసుకొచ్చింది ఈ మూవీ. తేజు సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందింది.

- Advertisement -