ప్రతినిధి 2..మళ్లీ వాయిదానే!

24
- Advertisement -

నారా రోహిత్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తూ, ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ప్రతినిధి 2. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఇంటెన్స్ టీజర్, ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించి మంచి అంచనాలు నెలకొల్పాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మరోసారి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. ఇందుకు సంబంధించి పోస్టర్‌ని రిలీజ్ చేసిన మేకర్స్ త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌తో వస్తామని తెలిపారు. సిరి లెల్ల హీరోయిన్ గా నటించగా వానర ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మించారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే…

- Advertisement -