ప్రతి ఎకరాకు పదివేలు: సీఎం కేసీఆర్‌

34
- Advertisement -

తెలంగాణలో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ హామీనిచ్చారు. ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

గాలివాన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. మొక్కజొన్న 1,29,446 వరి 72,709 మామిడి 8,865 ఇతర పంటలు అన్ని కలిసి 17,238ఎకరాల్లో నష్టం జరిగిందన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కంటే కూడా అత్యధికంగా తలసరి ఆదాయం రూ. 3,05,000తో ఉంది. జీఎస్‌డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది.

జీఎస్‌డీపీ పెరుగుదలతో వ్యవసాయం పాత్రే అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ వాటా 21 శాతం ఉంది. యావరేజ్‌గా 16 శాతం వరకు ఉంది. అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రైతులు ఏవిధంగా నిరాశకు గురికావద్దు.. ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలిపారు. ఇంకా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చాలని చెప్పారు. కేంద్రంలో ఇన్సూరెన్స్‌ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్ప రైతులకు లాభం చేసే బీమాలు లేవన్నారు. పాత ప్రభుత్వాలు అంతే.. ఇప్పుడు కూడా అంతే.. చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా ఉంది. వాళ్లకు చెప్పినా లాభం లేకుండా ఉంది.

భారతదేశానికే కొత్త అగ్రికల్చర్‌ పాలసీ రావాలన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంకు నివేదిక ఇవ్వట్లేదన్నారు. వాళ్లు ఎకరానికి మొక్కజొన్న రూ.3,333, వరి చేళ్లకు 5400, మామిడి తోటలకు 7200 ఇస్తామని స్కీంలో ఉంది. ఇది ఏ మూలకు సరిపోదు. కాబట్టి రైతులను మేమే ఆదుకుంటాం. అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంట్‌, ఉచిత నీళ్లు, వాటర్‌ సెస్‌ బకాయి రద్దు చేసి రైతులను ఆదుకోవడం వల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది. ఆ స్థితిని దెబ్బతీయనివ్వకూడదు కాబట్టి ఈ రంగాన్ని నిర్వీర్యం కానివ్వం.

ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిరాశపడొద్దు. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది. తెల్వక దీన్ని చాలామంది నష్టపరిహారం అని అంటారు. కానీ వీటిని సహాయ పునరావాస చర్యలు అని పిలవాలి. రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయసహకారాలు అందించాలి. అందుకే ఎకరానికి 10వేలు ప్రకటిస్తున్నా. వెంటనే వీటిని అందజేస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి…

వర్షప్రభావిత ప్రాంతాలకు సీఎం కేసీఆర్..

సీఎం కేసీఆర్ టూర్ షెడ్యూల్..

మీరేమంటారు..ప్రజలకు కేటీఆర్ ప్రశ్న?

- Advertisement -