మనీష్ బాబు హీరోగా రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి. సత్యారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ప్రశ్నిస్తా. అక్షిత, హసీస్, షిప్రా కౌర్, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఉగాది కానుకగా ఏప్రిల్ 6న విడుదలవుతుంది. వెంగి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకి శ్రోతల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్బంగా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిపారు.
ఈ కార్యక్రంలో పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి, నటులు రావు రమేష్, వేణుగోపాల్, హీరో మనీష్ బాబు, హీరోయిన్ అక్షిత, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, సంగీత దర్శకుడు వెంగి, ఫైట్ మాస్టర్ నందు, నిర్మాత పి. సత్యారెడ్డి తదితరులు పాల్గొనగా సహనిర్మాతలు సతీష్ రెడ్డి, శేషు బాబు, బొకేలతో అందరికీ స్వాగతం పలికారు. అనంతరం ‘ప్రశ్నిస్తా’ చిత్రంలోని పాటలను స్రీన్ పై ప్రదర్శించారు. ఆర్. నారాయణమూర్తి చిత్ర యూనిట్ సబ్యులకు ప్లాటినం డిస్క్ లను అందించారు.
పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. సత్యారెడ్డి కథకుడు, దర్శకుడు, నిర్మాత. ఆయన మంచి సినిమాలు తీశారు. ఇప్పుడు వారి అబ్బాయిని హీరోగా పెట్టి.. రాజా వన్నెంరెడ్డి మీద వున్న నమ్మకంతో ప్రశ్నిస్తా సినిమా తీశారు. హీరోకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ మనీష్‌లో వున్నాయి. ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే కథ, కథనం బాగుండాలి. దానిని సమర్థవంతంగా తెరకెక్కించే దర్శకుడు కావాలి. సాంగ్స్ ట్రైలర్స్ బాగున్నాయి. మా రాజా వన్నెంరెడ్డి గొప్పగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. మగవారికి మేము ఎందులోనూ తక్కువ కాదంటూ ఈవాళ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ వున్నారు. చెడుకి వ్యతిరేకంగా వారు ఎదురు తిరిగి పాలకులను ప్రశ్నిస్తే ఎలావుంటుంది అనేది ఈ చిత్ర కథ అని నేను భావిస్తున్నాను. మహా మహులు, శాస్త్రవేత్తలు సైతం తమని తాము ప్రశ్నిచుకోబట్టే గొప్ప వారు అయ్యారు. ప్రశ్న అనేది చాలా గొప్పది. ఈ చిత్రం కూడా అంత గొప్పగా ఉండాలని కోరుకుంటూ.. ఈ చిత్రం పెద్ద హిట్ అయి మనీష్ బాబు స్టార్ హీరో అవ్వాలని ఆశిస్తున్నాను.
ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ప్రశ్నిస్తా టైటిల్ సాంగ్ రాశాను. ఐటమ్ సాంగ్‌లు ఎప్పుడు రాయలేదు. ఇప్పటికి 24 ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. దాసరి యూనివర్సిటీ నుండి వచ్చిన వాడిని కాబట్టి మంచి పాటలు రాయగలిగాను. ఈ సినిమా మంచి హిట్ అయి సత్య రెడ్డి కి లాభాలు రావాలని కోరుకుంటున్నాను.
ప్రముఖ నటులు రావు రమేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మంత్రి క్యారెక్టర్‌లో నటించాను. రాజవన్నేంరెడ్డి ఆర్టిస్టులతో తనకి కావాల్సిన విధంగా నటనని రాబట్టుకున్నారు. ఆయన స్టయల్ చూసి ఇలా కూడా చేయవచ్చా అని ఆశ్చర్యం కలిగింది. సినిమా బాగా వచ్చింది. మనీష్ బాబు కొత్తవాడైనా బాగా చేశాడు. ఈ సినిమా మంచి హిట్ అయి మనీష్ మరిన్ని మంచి సినిమాలు చేయాలి. . అన్నారు.
నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. టైటిల్ సాంగ్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. వెంగి మంచి పాటలు చేసాడు. రావు రమేష్ పాత్ర సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. రేపు ఉగాది కానుకగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. సినిమాని ఆదరించి మా అబ్బాయిని ఆశీర్వదించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను. అన్నారు.
హీరో మనీష్ బాబు మాట్లాడుతూ.. మంచి సినిమా చేశాం. అందరికీ నచ్చుతుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో వున్నాయి. రావు రమేష్ చాల సపోర్ట్ చేసారు. వేంగి మంచి సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమా నాకోసం కాకుండా రాజావన్నెంరెడ్డి కోసం హిట్ అవ్వాలి. చాలా కస్టపడి ఆయన ఈ సినిమా చేసారు. మా ప్రశ్నిస్తా చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
దర్శకుడు రాజావన్నెంరెడ్డి మాట్లాడుతూ.. రావు రమేష్, హీరో మనీష్ క్యారెక్టర్స్ రెండూ పోటా పోటీగా ఉంటాయి. యాక్షన్ లి రియాక్షన్ కరెక్టుగా వున్నప్పుడే ఆ పత్రాలు హైలెట్ అవుతాయి. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా చాల పెద్ద హిట్ అయి మనీష్ బాబు పెద్ద హీరోగా ఎదగాలి. సత్యారెడ్డి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ చిత్రం తీశాను. వేంగి మ్యూజిక్ సుద్దాల అశోక్ తేజ పాట ఈ సీనియాకి ప్లస్ అయ్యాయి. అన్నారు.