కేసీఆర్ స్థాయికి రావాలంటే వందేళ్లు సరిపోవు!

6
- Advertisement -

రాష్ట్రంలో ఏదైనా ఒక గ్రామం లేదా నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లెకు పోదాం, ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయ్యిందో లేదో అడుగుదాం అని అన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. అందరికి రుణమాఫీ అయితే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా అని కేటీఆర్ గారు ఛాలెంజ్ విసిరితే ఇప్పటికి సమాధానం లేదు.కేటీఆర్ చేసిన ఛాలెంజ్‌కే రేవంత్ రెడ్డి సప్పుడు చేయడం లేదు.. ఈ మొనగాడికి కేసీఆర్ రావాలి అంట అని మండిపడ్డారు ప్రశాంత్ రెడ్డి.

కేసీఆర్ స్థాయి రావాలంటే రేవంత్ రెడ్డికి వందేళ్లు కూడా సరిపోవు. … కేసీఆర్ కి ఎప్పటికీ నువ్వు సమ ఉజ్జీ కాలేవు రేవంత్ అని మండిపడ్డారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్.

ఎన్నికల తర్వాత రైతు భరోసా పథకాన్ని ఎత్తేస్థారని మాకు విశ్వసనీయ సమాచారం ఉంది అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.స్థానిక ఎన్నికల తర్వాత కూడా రైతు భరోసా తప్పకుండా అమలు చేస్తామని, ఇది ఎన్నికల స్టంట్ కాదని రేవంత్, తుమ్మల ప్రజలకు, రైతులకు స్పష్టం చేయాలి అని డిమాండ్ చేశారు.

Also Read:హాలీవుడ్‌లోకి వరలక్ష్మి శరత్‌కుమార్

- Advertisement -