గిన్నిస్ బుక్‌లోకి రేవంత్ రెడ్డి..వేముల ఫైర్!

5
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్దాలకు ఆయన్ని గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించాలని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి…అసెంబ్లీలో బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడదామంటే మైకులు కట్టేశారని మండిపడ్డారు.

అసెంబ్లీని కౌరవ సభలా నడిపించారని వేముల ప్రశాంత్‌ రెడ్డి మండిపడ్డారు. కళ్లున్న కబోధి రేవంత్‌ రెడ్డి అని …రాష్ట్ర బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలు, 420 హామీల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్‌ రెడ్డి చెబుతున్నారని వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఎక్కడైనా ఉద్యోగాలు భర్తీ చేస్తారా అని ప్రశ్నించారు.

అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని..కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను తిట్టడానికే అసెంబ్లీని వినియోగించుకున్నారని ప్రశాంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఏడు . రేవంత్‌ రెడ్డిది ప్రజాపాలన కాదు.. నియంతృత్వ పాలన అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ మిత్రపక్షమని చెబుతున్న ఎంఐఎం కూడా కాంగ్రెస్‌ తీరును తప్పుబట్టిందని తెలిపారు. సీఎం ఇష్టారాజ్యంగా సభను తప్పుడు దోవ పట్టించారని విమర్శించారు.

Also Read:తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

- Advertisement -