పసుపుకు గిట్టుబాటు ధర ఏది?: ప్రశాంత్ రెడ్డి

6
- Advertisement -

కుటుంబం మొత్తం 9 నెలలు కష్టపడితే వచ్చే పంట పసుపు పంట.. పసుపు ప్రధాన వాణిజ్య పంట.ఒకప్పుడు పుట్టి పసుపు (రెండు క్వింటాలు) అమ్మితే తులం బంగారం వచ్చేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. నిజామాబాద్‌ బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి.. రైతుకు వేరే పంటలు నష్టం చేసినా పసుపు పంట ఆదుకునేది. అందుకే పసుపును తల్లి పంటగా,పచ్చ బంగారంగా పిలుస్తారు అన్నారు.

దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం, మార్కెట్ అధికారులు,జిల్లా మార్కెట్ కమిటీ పసుపు దళారులతో,ఖరీదు దారులతో కుమ్ముకు అయ్యారు…మేము అధికారంలోకి వస్తే పసుపు కు క్వింటాలుకు 12000 రూపాయల మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. అలాగే BJP కేంద్ర ప్రభుత్వం నామ మాత్రపు Msp లేని పసుపు బోర్డు పెట్టీ రైతులను మోసం చేసిందన్నారు.

అనివార్యమైన పరిస్థితుల్లో గంజ్ లో రెండు మూడు రోజులు నెరవడి జిల్లా రైతులు తుట్టికి పావిసేరుకు పనుపు అమ్ముకుంటున్నారు.Nzb గంజి పసుపునకు పెద్ద మార్కెట్.నిజమాబాద్ జిల్లా నుండి చుట్టూ పక్కన జిల్లాల నుంచి ఇక్కడికే పసుపు అమ్మకాలకు వస్తారు అన్నారు. దేశంలోనే అత్యధిక పసుపు పండించే జిల్లా నిజామాబాద్. ..పాలకవర్గం, అధికారులు, దళారులు కుమ్మక్కు కావడం వల్ల ఈ సీజన్ కు క్వింటాలుకు 13000 పలికిన పసుపు రూ. పదివేలకు పడిపోయిందన్నారు.

పసుపు బోర్డు తెచ్చి ధర పడిపోతే ఎంపి ఎక్కడ ? మోడీ ఎక్కడ ? నాడు పాలాభిషేకాలు చేసుకున్న మీకు ఇప్పుడు ఏమి చేయాలి ? మీ మాటలు నమ్మి ఓటేసిన రైతులను ఇట్లా మోసం చేయడం భావ్యం కాదు.. పసుపు బోర్డు వస్తె రైతుకు మద్దతు ధర రాలేదు కానీ పల్లె గంగారెడ్డికి మాత్రం పదవి వచ్చింది. ప్రధానిని కలిసి పసుపు ధర దృష్టికి తీసుకెళ్లండి. పోయినసారి క్వింటాలుకు16 వేలు అమ్ముడిపోతే నేడు 10 వేలు కూడా రావడం లేదు అని మండిపడ్డారు.

Also Read:కాంగ్రెస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా

డిమాండ్ ….

1. క్వింటాలుకు రూ. 10 వేల ధర తగ్గకుండా చూడాలి.దళారులు, అధికారులు కుమ్మక్కు మోసం చేయడాన్ని అరికట్టాలి.

2.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పసుపుకు రూ. 12 వేలు ఇస్తననే హామీ నెరవేర్చాలి.

3. ఎంపి అరవింద్, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి లు ప్రధానిని కలిసి రూ. 15 వేల మద్దతు ధర ఇచ్చే బోర్డు కావాలని డిమాండ్ చేయాలి. వడ్లు కొన్నట్టు కొనుగోలు కేంద్రాలు పెట్టి క్వింటాలకు 15 వేలతో పసుపును ప్రభుత్వమే కొనాలి.

- Advertisement -