సలార్‌పై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్!

152
salaar movie
- Advertisement -

కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సలార్. 2023లో సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా పాన్ ఇండియా లెవల్లో సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో రాజమన్నార్‌గా జగపతిబాబు కనిపించనుండగా ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం సినిమాలో కీరోల్ పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతుండగా వాటిని ఖండించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఉగ్రం సినిమాకు తెలుగు రీమేక్‌గా సలార్ వస్తుందని ప్రచారం జరుగుతుండగా వాటిని ఖండించారు.

సలార్ సరికొత్త కథతో వస్తున్న సినిమా అని.. ఇది ఉగ్రం సినిమాకు రీమేక్ కాదని తేల్చి చెప్పారు. ఇది ఒరిజినల్ మూవీగా ప్రేక్షకులను అలరించడం ఖాయమని …ప్రభాస్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడం పక్కా అని తెలిపారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్‌ 2 విడుదలకు సిద్ధంగా ఉండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -