ప్రశాంత్ నీల్ నెక్ట్స్‌ ప్రాజెక్ట్ ఇదే!

18
- Advertisement -

కే‌జి‌ఎఫ్ సిరీస్, సలార్ పార్ట్ 1 మూవీస్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా గతేడాది డిసెంబర్ లో వచ్చిన సలార్ మంచి వసూళ్లను రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో నెక్స్ట్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై ఇండియన్ సినీ అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చుట్టూ మూడు ప్రాజెక్ట్ ల పేరు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక మూవీ, ప్రభాస్ తో చేయబోయే సలార్ పార్ట్ 2, అలాగే కే‌జి‌ఎఫ్ చాప్టర్ 3.. ఈ మూడు ప్రాజెక్ట్ లలో ప్రశాంత్ నీల్ ఏ ప్రాజెక్ట్ ను పట్టలేక్కిస్తారానేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. సలార్ తర్వాత ఎన్టీఆర్ తో చేయబోయే మూవీని పట్టాలెక్కిస్తారనే టాక్ ఆ మద్య గట్టిగా వినిపించింది. .

అటు కే‌జి‌ఎఫ్ చాప్టర్ 3 పై కూడా హమ్బోలే నిర్మాణా సంస్థ అడపా దడపా హింట్ ఇస్తుండడంతో ముందు కే‌జి‌ఎఫ్ చాప్టర్ 3 తెరకెక్కించిన తరువాత ఎన్టీఆర్ మూవీ ఆ తర్వాత సలార్ పార్ట్ 2 తెరకెక్కిస్తాడనే గుసగుసలు వినిపించాయి. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సలార్ పార్ట్ 2 తెరకెక్కించేందుకే ప్రశాంత్ నీల్ సిద్దమౌతున్నారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో సలార్ లో నటించిన పృధ్వీరాజ్ మాట్లాడుతూ సలార్ పార్ట్ 2 మూవీ 2025 లో విడుదల అవుతుందని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రశాంత్ నీల్ సలార్ 2 పైనే వర్క్ చేస్తున్నాడని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏ. డి, రాజాసాబ్ మూవీస్ చేస్తున్నాడు. ఈ మూవీస్ పూర్తయిన తర్వాత సలార్ పార్ట్ 2 లోనే నటించే అవకాశం ఉంది. సలార్ 2 ముందుకు రావడంతో ఎన్టీఆర్ తో చేయబోయే ప్రాజెక్ట్ అలాగే కే‌జి‌ఎఫ్ చాప్టర్ 3 మూవీస్ మరింత ఆలస్యం కానున్నాయి. మరి సలార్ 2 తో ప్రశాంత్ నీల్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Also Read:టీడీపీలో ‘ఉండి’ టికెట్ రచ్చ!

- Advertisement -