ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందానికి అభినందనలు తెలిపారు. నిన్న సాయంత్రం ప్రశాంత్ కిషోర్ ఆఫీసుకు వెళ్లిన జగన్ కు ఘన స్వాగతం పలికారు. జగన్ ఆఫీసులోకి రాగానే సీఎం సీఎం అంటూ అరిచారు ప్రశాంత్ కిషోర్ టీం. ఈసందర్భంగా ప్రశాంత్ కిషోర్ ను ఆప్యాయంగా అలీంగనం చేసుకున్నారు జగన్.
పీకే టీం పాదయాత్రలో చాలా కష్టపడ్డారన్నారు జగన్. ప్రజల్లోకి వెళ్లడం వల్లే వైసీపీ అధికారంలోకి రాబోతుందన్నారు. వైసీపీ విజయం కోసం శ్రమించినందుకు ప్రశాంత్ కిషోర్ టీంకు ధన్యవాదాలు తెలిపారు జగన్. ఇంకా పలు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ తాము నిర్వర్తించాల్సిన విధులకోసం ఐప్యాక్ బృందం సభ్యులు తరలి వెళుతున్నారు.
ఈసందర్భంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ఏపీలో అద్బుతమైన పాలన అందించేందుకు జగన్ సీఎం కాబోతున్నారని చెప్పారు. ఇప్పుడు తన ముందు ప్యూచర్ సీఎం ఉన్నారంటూ ఐ ప్యాక్ సిబ్బందికి జగన్ ను పరిచయం చేశారు. జగన్ దేశంలోనే నెం1 సీఎంగా సేవలదించాలని కోరుకుంటున్నానని తెలిపారు ప్రశాంత్ కిషోర్.