ఏపీలో వైసీపీ డేంజర్ జోన్ లో ఉందా వుందా ? రాబోయే ఎన్నికల్లో గెలుపు కష్టమేనా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తుండడంతో వైసీపీ వర్గంలో ఆందోళన మొదలైంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఓ జాతీయ మీడియాలో మాట్లాడుతూ ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి రావడం కష్టమేనని చెప్పుకొచ్చారు. గతంలో కూడా పీకే ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి. ” జగన్ ప్రొవైడర్ మోడ్ లోనే ఉండిపోయారని, నగదు పంచడం తప్పా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, ఉద్యోగాలు కల్పించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం.. ఇలా అన్నిట్లో విఫలం అయ్యారని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. .
ఈ కారణాల చేత ప్రజల్లో జగన్ పై వ్యతిరేకత పెరిగిందని, అందుకే రెండో సారి అధికారం కష్టమే అంటూ పీకే తనదైన రీతిలో వివరణ ఇచ్చారు. అయితే పీకే చేసిన వ్యాఖ్యలపై వైసీపీ వర్గం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కోసం పని చేస్తున్నారని, అందుకే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ చెబుతున్నారు వైసీపీ నేతలు. అయితే గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా వైసీపీకి ఇదే తరహా అభిప్రాయాలూ వ్యక్తమౌతుండడంతో గెలుపు విషయంలో వైసీపీ కొంత ఆందోళనగానే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇప్పటివరకు బయటకు బయటకు వచ్చిన సర్వేలు సైతం వైసీపీకి ప్రతికూల ఫలితాలనే ఇస్తూ వచ్చాయి. అయితే సర్వేల సంగతి ఎలా ఉన్నా ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధిస్తామని మొదటి నుంచి వైసీపీ ధీమాగా చెబుతూ వస్తోంది. మరి ఆ స్థాయి విజయం దక్కుతుందా లేదా అనే సంగతి అటుంచితే ? కనీసం అధికారం కోసం అవసరమైన 88 సీట్లనైనా గెలుచుకునేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా వైసీపీకి పోటీగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడం కూడా వైసీపీని గట్టిగా దెబ్బ తీసే అంశమే. మరి ప్రస్తుతం వైసీపీపై వస్తున్న నెగిటివిటీని ఎదుర్కొని ఆ పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.
Also Read:2029 నో ఎలక్షన్స్..మోడీ ప్లాన్ అదే!