ఏపీ ఎన్నికల ఫలితాలపై పీకే సంచలనం!

12
- Advertisement -

ఏపీ ఎన్నికల ఫలితాలపై పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని…సీఎం జగన్ చెప్పినట్లుగా ఫలితాలు వచ్చే అవకాశం లేదని తేల్చేశారు. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ కూడా తాము గెలుస్తామని చెబుతున్నారని..కానీ ఫలితాలు పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయన్నారు.

ఈ ఎన్నికల ఫలితాల్లో నా అంచనాలు తప్పయితే నా ముఖంపై పేడ పడుతుందని…బెంగాల్‌లో నాతో సవాల్ చేసిన అమిత్ షా ముఖంపై పేడ పడిందని గుర్తు చేశారు. తాను చెప్పింది నిజమైతే జగన్ మొఖంపై పేడ పడుతుంది లేదంటే నా మొఖంపై పడుతుందని చెప్పారు.

ఎన్నికల ముందే ఓటమిని ఏ రాజకీయ నాయకుడు కూడా అంగీకరించరన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గవని …దేశంలో బీజేపీ, మోడీలపై అసంతృప్తి ఉందని.. అంతేకానీ, ఆగ్రహం లేదని చెప్పారు.

Also Read:Chiru:’రాజు యాదవ్’ అలరిస్తుంది..

- Advertisement -